December 23, 2024

karinmangar voice

telugu news

వేములవాడ ఎంఎల్ఏ పీఠం బిసి కే

Spread the love

వేములవాడ ఎంఎల్ఏ పీఠం బిసి కే

నిరాశ తో కుస్తీ పడుతున్న మిగతా అభ్యర్థులు

-అన్ని సర్వేల్లోనూ కాంగ్రెస్ పార్టీదే ఘన విజయం

యోగి వచ్చినా..కేసిఆర్ వచ్చిన ప్రయోజనం శూన్యం

కోట్ల రూపాయలు పంచే యోచనలో అభ్యర్థులు

వాయిస్ న్యూస్ ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా నవంబర్:-27

వేములవాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్,బిజేపి పార్టీల నుండి ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్న ఇద్దరు వెలమ దొరలు వారి గెలుపు పై సమాలోచనలో ఉన్నారు.రాష్ట్రంలో తాజాగా నిర్వహిస్తున్న ప్రతి సర్వేల్లోనూ కాంగ్రెస్ పార్టీకే విజయావకాశాలు ఎక్కువగా ఉండడంతో చేసేదేం లేక తలలు పట్టుకుంటున్నారు.అభ్యర్థుల గెలుపు కోసం బిఅర్ఎస్ పార్టీ నుండి స్వయంగా ముఖ్యమంత్రి కేసిఆర్,బిజేపి నుండి యూపీ ముఖ్యమంత్రి అదిత్యనాథ్ ప్రచారం చేసిన ప్రయోజనం కనిపించడం లేదు.ఈ ఎన్నికల్లో ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండే బీసీ నాయకుడు ఆది శ్రీనివాస్ ను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని వేములవాడ ప్రజలు బలంగా సంకల్పిస్తున్నారు.ప్రజల తీర్పును మిగతా పార్టీ ల అభ్యర్థులు జీర్ణించుకోలేకపోతున్నారు.కోట్ల రూపాయల డబ్బులు పంచైన సరే అణగారిన వర్గాలకు రాజ్యాధికారం దక్కకూడదని పెద్ద ఎత్తున కుట్రలు పన్నుతున్నారు.స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండని సామాజిక వర్గానికి చెందిన నాయకులు కేవలం అధికారం కోసమే డబ్బుల సంచులతో మభ్యపెట్టడాన్ని నియోజకవర్గంలోని ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు.ఇన్నాళ్లు అక్రమంగా వారు దోచుకున్న సొమ్మును తీసుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ కు ఓటు వేస్తామని కరాఖండిగా చెపుతున్నారు.ఎప్పుడు లేనంత బలమైన చైతన్యం వేములవాడలో ప్రజల్లో మొదలైంది.ఈసారి మార్పు జరిగితేనే వేములవాడ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందనే చర్చ కొనసాగుతుంది.నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చెన్నమనేని రమేష్ బాబు పై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది.గెలిచిన ప్రతిసారి ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం,జర్మనీ దేశానికే పరిమితం కావడం,అభివృద్దిని పట్టించుకోకపోవడం వంటి అంశాలు రమేష్ బాబు ఓటమికి కారణాలు అవుతాయని బిఆర్ఎస్ పార్టీ గుర్తించి పౌరసత్వం కేసును సాకుగా చూపిస్తూ కేసిఆర్ వేములవాడలో అభ్యర్థిని మార్చి కరీంనగర్ పట్టణానికి చెందిన చల్మెడ లక్ష్మి నరసింహ రావు కు టికెట్ కేటాయించారు
అభ్యర్థి విషయంలో మార్పు జరిగిన కూడా చల్మెడ స్థానికేతరుడు కావడంతో ఆయనపై ప్రజలకు నమ్మకం కలగడం లేదు.గెలిచిన తర్వాత చల్మెడ కూడా ప్రజలకు అందుబాటులో ఉండడని,తన అహంకారంతో అభివృద్ధిని పట్టించుకోడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.మరోవైపు చెన్నమనేని రమేష్ బాబును కాదని తన టికెట్ ను చల్మెడ కు కేటాయించడాన్ని రమేష్ బాబు వర్గీయులు ముందు నుండి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.ఎలాగైనా సరే ఇక్కడ చల్మెడను ఒడిస్తెనే తమ నాయకుడు రమేష్ బాబు నియోజకవర్గం ఇంచార్జ్ గా ఉంటారని,ఈ ఒక్కసారి స్థానికుడు ఆది శ్రీనివాస్ కు అవకాశం ఇవ్వాలని బిఆర్ఎస్ అసమ్మతి నాయకులు నిర్ణయం తీసుకుంటున్నారు.బిఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో కూడా రమేష్ బాబు ఎక్కువగా ఆసక్తి చూపించక పోవడం ఆదివారం వేములవాడ పట్టణంలో నిర్వహించిన కెసిఆర్ బహిరంగ సభలోనూ ఆయన నిరాశగా సభలో ప్రసంగిస్తూ కేసిఆర్ ఇది వరకు ఇక్కడికి ప్రజలకు ఇచ్చిన హామీలు గుర్తు చేస్తూ పరోక్షంగా తన అవేదన వ్యక్తం చేశారు.గంభీరమైన తన గొంతుతో మాట్లాడుతూ పదే పదె సారూ మా హామీలు నెరవేర్చండని అంటూ కేసిఆర్ ను హెద్దేవా చేశారు.దీంతో సభకు వచ్చిన ప్రజలు సైతం ఆశ్చర్యానికి లోనయ్యారు.సభలో కేసిఆర్ మాట్లాడుతుండగానే డబ్బులు ఇచ్చి భారీగా తరలించిన ప్రజలు తిరుగు ప్రయాణం అయ్యారు.వారిని అపడం బిఆర్ఎస్ నాయకులతో కాలేదు.దీంతో బిఅర్ఎస్ పార్టీ పైన ప్రజలకు ఉన్న వ్యతిరేకత కళ్ళకు కట్టినట్లు కనబడింది.సభకు వచ్చిన ప్రజలు సైతం చల్మెడ గెలుపు కష్టమని,ఎన్ని డబ్బులు పంచినా తాను ఓడిపోవడం ఖాయమంటున్నారు.తమ ఓటు బీసీ నాయకుడు ఆది శ్రీనివాస్ కే అంటూ తేల్చి చెపుతున్నారు.మరోవైపు బిజేపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెన్నమనేని వికాస్ రావు సైతం వెలమ సామాజిక వర్గానికి చెందిన వాడు కావడంతో ఆయన గెలుపు కూడా కష్టతరంగా మారింది.బిజెపి వేములవాడ టికెట్ ముందు బీసీ మహిళ తుల ఉమా కు ఆ పార్టీ అధిష్టానం అధికారికంగా కేటాయించింది.బిసీల ఎదుగుదలను జీర్ణించుకోలేని కొంత మంది సీనియర్ నాయకుల ప్రోద్బలం తో చివరి నిమిషంలో బి -ఫామ్ ను వికాస్ రావు ఇప్పించుకున్నారు.దీంతో ఒక ఆడబిడ్డను నమ్మించి వెలమ దొరలు చేసిన అన్యాయాన్ని నియోజకవర్గంలోని ప్రజలందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు.ఇలాంటి వాళ్ళు గెలిస్తే వేములవాడలో అరాచకాలు ఎక్కువ అవుతాయనే భావన ప్రజల్లో బలంగా నాటుకుపోయింది.ముఖ్యంగా వేములవాడలో వికాస్ రావు గెలిస్తే ఆ పార్టీ జిల్లా జిల్లా స్థాయి నాయకుడు ప్రజలపైన నియంతలాగా పెత్తనం చెలాయిస్తాడని ప్రజలు భయబ్రాంతులకు గురౌతున్నారు.దొరలను గెలిపించుకుని బానిస బ్రతుకులు బతికే బదులు బిసి బిడ్డ,ప్రజలందరికి అందుబాటులొ ఉండే నాయకుడు ఆది శ్రీనివాస్ ను భారీ మెజారిటీతో గెలిపించుకుని వేములవాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటామని ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు.ఎన్నడూ లేనంత బలమైన చైతన్యం వేములవాడ ప్రజల్లో రావడాన్ని మిగతా అభ్యర్థులు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు.ఇన్నాళ్లు కేవలం అధికారం కోసమే ప్రజలకు మాయ మాటలు చెప్పి నిర్మించుకున్న తమ దొరల రాజ్యం కూలిపోతుందనే భయంలో పడిపోయారు.ఈ ఎన్నికల్లో వేములవాడ ప్రజలు తమ ఓట్ల రూపంలో దొరలకు గట్టిగా బుద్ది చెప్పాలనే యోచనలో ఉన్నారు.అణగారిన వర్గాలకు వాళ్ళు చేస్తున్న మోసానికి దిమ్మ తిరిగే తీర్పును ఇవ్వబోతున్నారు.వెనకబాటుకు గురైన వేములవాడ ప్రాంతం అన్నిరంగాల్లో అభివృద్ది సాధించాలంటే ఇక్కడ మార్పు రావాల్సిందేనని ప్రజలు అంటున్నారు.ఈ ఎన్నికల్లో చేతి గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని కొండంత భరోసా ఇస్తున్నారు.

Copyright © All rights reserved by KARIMNAGAR VOICE NEWS | Newsphere by AF themes.