పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
ప్రాజెక్టు వర్క్ చేయలేదని ఉపాద్యాయుల ఆగ్రహం మనస్థాపం చెంది పురుగుల మందు తాగిన విద్యార్థిని
అడిషనల్ కలెక్టర్ బిఎస్ లతా కి వినతి పత్రం అందించిన ABVP నాయకులు
జగిత్యాల ( వాయిస్ న్యూస్ ) జనవరి 27
పదవ తరగతి విద్యార్థిని ప్రాజెక్టు వర్క్ చేయలేదని ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో మనస్థాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన జగిత్యాల మండలంలో చోటుచేసుకుంది. బాధితుడు గాదె సురేష్ కథనం ప్రకారం జగిత్యాల పట్టణంలోని ధర్మపురి రోడ్డులో ఉన్న సూర్య గ్లోబల్ ప్రైవేట్ పాఠశాలలో తన కూతురు 10వ తరగతి చదువుతున్నదని రెండు రోజుల క్రితం ప్రాజెక్టు వర్క్ చేయలేదని క్లాసులో ఉపాధ్యాయుడు ఆగ్రహం వ్యక్తం చేయడంతో మనస్థాపన చెందిందన్నాడు. శుక్రవారం రోజున గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉదయం స్వగ్రామం అనంతరం నుండి స్కూల్కు వెళ్లామని తెలుపగా అంతలోనే ఇంటిలో కెళ్లి మామిడితోటకు వాడే పురుగుల మందు తాగింది. వెంటనే జగిత్యాలలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స పొందుతుందని పేర్కొన్నారు. శనివారం ఏబీవీపీ ఆధ్వర్యంలో జగిత్యాల్ జిల్లా కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ బిఎస్ లతకు ఏబీవీపీ నాయకులు వినతి పత్రం సమర్పించారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.