సింగరేణి స్థలాలు కబ్జా..
ప్రహరీ గోడ ధ్వంసం
కబ్జారాయుళ్ళ బరితెగింపు.
సింగరేణి ప్రహరీలు ధ్వంసం
పెద్దపల్లి ( వాయిస్ న్యూస్ ) మార్చి 27
ఫుట్‌పాత్ ల ఆక్రమణ.
సింగరేణి స్థలాల్లో ఇళ్ళు నిర్మించుకున్న వారికి ప్రభుత్వం హక్కులను కల్పించడం ఆసరాగా చేసుకొని కొందరు కబ్జారాయిలు సింగరేణి ఎస్టేట్ అండతో నేరుగా సింగరేణి ప్రహరీలనే ధ్వంసం చేశారు. సాక్షాత్తు రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయం ఎదురుగా ప్రధాన రహదారి పక్కనే ఉన్న సింగరేణి ప్రహరీని రెండు రోజుల క్రితం ధ్వంసం చేశారు. గోదావరిఖని బస్టాండ్ కాలనీ కార్మిక నివాసాలకు రక్షణగా ఏర్పాటు చేసిన ప్రహరీని ధ్వంసం చేసి నేరుగా ఫుట్‌పాత్ నుండి మెట్లు నిర్మించారు .సింగరేణి స్థలాల్లో ఇల్లు నిర్మించుకున్న పేదలకు పట్టాలు ఇచ్చేందుకు సింగరేణి జనగామ శివారు సర్వేనెంబర్ 709 లో కొంత స్థలాన్ని రెవెన్యూ కు అప్పగించింది .పట్టాలు పొందిన కొందరు బస్టాండ్ కాలనీ అంతర్గత రహదారులను చూపి మునిసిపల్ నుండి ఇంటి నిర్మాణ అనుమతి తీసుకున్నారు. తర్వాత వ్యాపార సముదాయం నిర్మించి సింగరేణి ప్రహరీగోడ పగలగొట్టి నేరుగా ప్రధాన రహదారికే ద్వారం పెట్టారు. సింగరేణి ఆర్జీవన్ పరిధిలోని ఎస్టేట్, ఎస్ అండ్ పిసి అధికారులు సహకారం అందించినట్టు తెలుస్తుంది. ఒక్కో నిర్మాణానికి ఒక్కరేట్ కట్టి వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి.ఇప్పటికే వందల కోట్ల విలువైన స్థలాలు కబ్జా అయ్యేందుకు సహకారం ఇచ్చిన సింగరేణి ఉన్నతాధికారులు ఇప్పటికీ మారడం లేదనే విమర్శలు ఉన్నాయి.
- ఫుట్ పాత్ కబ్జావుతున్న పట్టించుకోని కమిషనర్.
నగరపాలక సంస్థ కార్యాలయం ఎదురుగానే ఫుట్ పాత్ కబ్జా చేసి నిర్మాణాలు చేస్తున్న నగరపాలక సంస్థ కమిషనర్ టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి .ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ నగరంలో మార్పుకు ప్రయత్నాలు చేస్తుంటే మరోవైపు సింగరేణి, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నిర్లక్ష్యం గా వ్యవహరించటం కబ్జాదారులకు వరంగా మారింది.ఎస్టేట్ అధికారి అల్లుడు ద్వార పదిలక్షల రూపాయలు సింగరేణి అధికారులకు ముట్టిన్నట్లు సమాచారం. ప్రహరీ గోడను ధ్వంసం చేసినా సింగరేణి యాజమాన్యం ఇప్పుటికి కేసు పెట్టకపోవటం పలు అనుమానాలకు దారి తీస్తుంది.