December 23, 2024

karinmangar voice

telugu news

ఏసీబీ వలలో అవినీతి అధికారి

Spread the love

ఏసీబీ వలలో అవినీతి అధికారి

7000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ పంచాయతీరాజ్ సీనియర్ అసిస్టెంట్

రాజన్న సిరిసిల్ల (వాయిస్ న్యూస్) మే 20

జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో సోమవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తిస్తున్న జోగినపల్లి భాస్కర్ రావు ఏడువేల రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. జిల్లాలోని గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ వెంకటేష్ సుమారు నాలుగున్నర లక్షలతో నిర్మించిన స్మశాన వాటిక కాంపౌండ్ వాల్ బిల్లు కోసం నాలుగు నెలలుగా తిప్పుతూ, చీఫ్ ప్లానింగ్ అధికారికి పంపించడం కోసం ఎనిమిది వేల రూపాయల లంచం డిమాండ్ చేయడంతో వెంకటేష్ ఏసీబీని సంప్రదించినట్లు డిఎస్పి వివి రమణమూర్తి తెలిపారు. కాగా సోమవారం ఏడు వేల రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా భాస్కర్ రావు ను పట్టుకొని, కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు పరచనున్నట్లు ఆయన తెలిపారు. అవినీతి అధికారులతో పీడించబడ్డ బాధితులు ఏసీబీ డీఎస్పీ 9154388954, సర్కిల్ ఇన్స్పెక్టర్లు 9154388955, 9154388956 నెంబర్లను సంపాదించాలని ఈ సందర్భంగా డీఎస్పీ రమణమూర్తి సూచించారు.

Copyright © All rights reserved by KARIMNAGAR VOICE NEWS | Newsphere by AF themes.