పుట్ట గొడుగుల్ల పుట్టుకొస్తున్న మైక్రో ఫైనాన్స్ కంపెనీలు.
పుట్ట గొడుగుల్ల పుట్టుకొస్తున్న మైక్రో ఫైనాన్స్ కంపెనీలు.
- ఉచితం బీమా ఇన్సూరెన్స్ అని నమ్మిస్తున్న ఫైనాన్సర్లు.
- రోజువారి కూలీలె వీరి టార్గెట్ హైదరాబాద్ వాయిస్ న్యూస్ (నవంబర్ 09)
ఆర్థికంగా చితికిన రోజువారి కూలీలు మైక్రో ఫైనాన్స్ కంపెనీల అప్పులకు ఆకర్షితులు అవుతున్నారు. జాతీయ బ్యాంకుల్లో అప్పులు తీసుకోవాలంటే సవా లక్ష కొర్రీలు పెట్టడంతో కూలి జనాలు మైక్రో ఫైనాన్స్ కంపెనీలకు ఆకర్షితులవుతున్నారు. సొంత చిరాస్తులు చరాస్తులు బంగారు ఆభరణాలు లేని బడుగు జీవులు అధిక వడ్డీ భారాలను భరించి మైక్రో ఫైనాన్స్ అప్పు తీసుకుని తమ అవసరాలను తీర్చుకుంటున్నారు. ప్రభుత్వం తాడిత పీడిత బడుగు బలహీన వర్గాలకు అనేక పథకాలు అమలు చేస్తున్నామని ఆ ఫలాలు వీరి ఆర్థిక పరిస్థితి పై ప్రభావం చూపడం లేదు. రోజు లభించని ఉపాధి నిత్యం పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలు బలహీనవర్గాలను కుంగదీస్తున్నాయి. పిల్లల స్కూల్ ఫీజులు దవాఖానాల ఖర్చులు తడిసి మోపడవుతున్నాయి. ఈ పరిస్థితిలో అత్యవసర ఖర్చుల నిమిత్తం రోజువారీ కూలీలు మైక్రో ఫైనాన్స్ లను ఆశ్రయిస్తున్నారు. నెలంతా చెమటోడ్చి ఒప్పందం ప్రకారం నెలవారి వాయిదాలు చెల్లిస్తున్నారు. అధిక వడ్డీ నడ్డి విరుస్తున్న ఓపికగా భరిస్తున్నారు. 10 మంది లేక ఆరుగురు గ్రూప్ ఉన్న చోట మైక్రో ఫైనాన్స్ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. తిరిగి వాయిదా డబ్బులు చెల్లించే సమయంలో గ్రూపులోని ఏ ఒక్కరు డబ్బులు కట్టకుండా మిగతావారు అందరూ కలిసి ఆ డబ్బును కట్టాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ప్రతి నెల ఒప్పందం ప్రకారం చెల్లించని వారి నుంచి నిర్బంధ వసూళ్ళు చేస్తున్నారు.సుమారు రూ.18 వడ్డీతో మైక్రో ఫైనాన్స్ కంపెనీ కూలీ జనాల రక్తం తాగుతున్నారు. కూలి దొరకని పరిస్థితిలో మైక్రో ఫైనాన్స్ వాయిదాలు చెల్లించడానికి మరో మైక్రో ఫైనాన్స్ కంపెనీ నుండి అప్పు తీసుకొని చెల్లించవలసిన దుస్థితిలో సామాన్యులు ఉన్నారు. అప్పు తీసుకున్న వారికి ఉచిత ఇన్సూరెన్స్ పొందిన దాఖలాలు ఇప్పటివరకైతే లేవు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల లోని ప్రతి గ్రామానికి ఫైనాన్స్ కంపెనీల నెట్వర్క్ వ్యాపించి ఉన్నది. మైక్రో ఫైనాన్స్ కంపెనీలు తమ ఏజెంట్ ద్వారా విస్తృత ప్రచారం చేస్తూ తమ కార్యకలాపాలు iకొనసాగిస్తున్నారు. రుణం తీసుకున్న వారు అకాల మరణం చెందితే రుణం మాఫీ అవుతుందని నమ్మబల్కుతున్నారు. మొదట్లో తక్కువ రుణాలు ఇచ్చిన మైక్రో కంపెనీలు వాయిదాలు సక్రమంగా చెల్లించిన వారికి రెండో విడుతలో రెండింతలు పెంచి ఇస్తున్నారు. మొత్తంగా పదివేల నుంచి లక్ష రూపాయల వరకు అప్పుగా ఇస్తున్నారు. డబ్బులు కట్టని యెడల మైక్రో ఫైనాన్స్ కంపెనీల వేధింపులకు మహిళలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు కూడా ఎదురవుతాయని అంచనా . ప్రభుత్వ చర్యతో సద్దుమణిగిన ఫైనాన్స్ కంపెనీలు మళ్లీ పురుడు పోసుకొని అప్పులు ఇవ్వడం మొదలుపెట్టాయి. ఏ వస్తువులు తనఖా పెట్టుకోకుండానే అప్పులు ఇచ్చి నిర్బంధ వసూలు చేసి అధిక వడ్డీతో పేదల నడ్డి విరుస్తున్నాయి. ప్రభుత్వం స్పందించి మైక్రో ఫైనాన్స్ కంపెనీల అధిక వడ్డీ వసూళ్లకు కళ్లెం వేసి చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.