తను మరణించిన కనులు మాత్రం సజీవం
తను మరణించిన కనులు మాత్రం సజీవం
వాయిస్ న్యూస్ జమ్మికుంట (నవంబర్ 11)
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణనికి చెందిన రసమల్ల రోజా అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడం జరిగింది. జమ్మికుంట పట్టణానికి చెందిన రసమల రోజా భర్త రవిలకు ఒక కుమార్తె, కుమారుడు రజక వృత్తి చేసుకునేవారు. ఆదివారం రోజున అకస్మాత్తుగా శ్వాస ఇబ్బందిగా ఉందని హుజురాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో వైద్యం కోసం వెళ్లగా అక్కడినుండి హనుమకొండ పెద్దాసుపత్రికి వెళ్లాలని అక్కడి వైద్యులు చెప్పగా వఇంటికి వచ్చి బట్టలు సర్దుకుని బయటికి వచ్చే సమయంలో అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి అక్కడే కుప్పకూలిపోయింది. అది గమనించిన భర్త రవి ఆమె దగ్గరికి వచ్చి చూడగా నిస్సహాయ స్థితిలో ప్రాణం కోల్పోయి ఉండడం చూశారు. అనంతరం గతంలో ఆమె చనిపోతే తన కళ్ళను ఇతరులకు దానం చేస్తానని ఓ ట్రస్ట్ కు చెప్పడం జరిగింది. ఆమె చనిపోయిన అనంతరం వారికి సమాచారం ఇవ్వగా ఆమె కళ్ళను తీసుకెళ్లడం జరిగింది. అది చూసిన ఆ వార్డు ప్రజలు ఆమె వ్యక్తిత్వం పట్ల తను లేకపోయినా ఆమె కళ్ళు ఇతరులకు ఉపయోగపడతాయని ఆమె తీసుకున్న నిర్ణయాన్ని వారు ఆమె మంచితనం వారి పిల్లల ఎదుగుదలకు దోహదపడుతుందని ఆమె వ్యక్తిత్వన్ని అభినందించారు.