ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ
ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ
కరీంనగర్ జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా కొనసాగుతుంది. మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ, నర్సింగ్ హోంల పేరిట వెలిసిన ఆస్పత్రుల్లో కొంతమంది అర్హత లేకున్నా వైద్యులుగా చెలామణి అవుతున్నారు. అంతేకాకుండా మరికొంతమంది సంబంధం లేని వ్యాధులకు చికిత్స చేస్తున్నాట్లు విమర్శలు లేకపోలేదు.. ప్రథమ చికిత్సలు మొదలు,శస్త్ర చికిత్సల వరకు రోగులను నిలువు దోపిడీ చేస్తున్నారు. నిబంధనల మేరకు డాక్టర్ లుగా పేర్లు కూడా పెట్టుకోకూడదు అని తెలిసినప్పటికీ,ఏకంగా కొందరు ఆర్ఎంపీ, పీఎంపీ బీహెచ్ఎంఎస్, బీఎంఎస్ సంపాదించి నర్సింగ్ హోంలు,
సంతాన సౌపాల్య కేంద్రాలు ఏర్పాటు చేస్తూ, ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. పలు ఆసుపత్రుల్లో తాజాగా వైద్య విద్య పూర్తి చేసిన వారితో విస్టింగ్ పేరిట ఆసుపత్రులకు రప్పిస్తూ రోగులను మభ్యపెడుతున్నారు. కొంతమంది ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాహకులే మెడికల్ దుకాణాలు నెలకొల్పి రోగులకు అవసరానికి మించి మందులు రాసిస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు.డాక్టర్లు వారి బందువులు,బినామీల పేర్లపై మెడికల్ దుకాణాలు నడిపిస్తున్నారు..
కరీంనగర్ జిల్లాలో ఉన్న కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులపై జిల్లా అధికారులకు ఫిర్యాదులు కూడా వస్తున్నట్లు సమాచారం..
పర్యవేక్షణ ఎది…?
పర్యవేక్షణేది..?
జిల్లాలోని ప్రవేటు ఆసుపత్రులపై సంబంధిత శాఖ అధికారుల పర్యవేక్షణ కొరవ డింది. జిల్లా కేంద్రంతో పాటు, మండల కేంద్రాల్లో ప్రైవేటు ఆసుపత్రులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. రోగులకు కనీస వసతులు, పరికరాలు సంబంధిత వైద్య నిపుణులు, సిబ్బంది లేకున్నా ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్నారు. ఎంతమంది వైద్యులు సిబ్బంది ఉన్నారనే విషయమై జిల్లా అధికారులకే సమాచారం లేదని విమర్శలు ఉన్నాయి. అసలే అర్హత లేని వైద్యులు ఆ పై సిబ్బందికి సైతం ఆవగహన లేక కొంతమంది రోగులు ప్రాణాల మీదకు తెస్తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు.