తాటిచెట్లు ధ్వంసం చేసిన ముగ్గురు వ్యక్తుల పై కేసు నమోదు
తాటిచెట్లు ధ్వంసం చేసిన ముగ్గురు వ్యక్తుల పై కేసు నమోదు
ముస్తాబాద్/ రాజన్న సిరిసిల్ల జిల్లా( వాయిస్ న్యూస్)డిసెంబర్,17:
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం లో 25 తాటి చెట్లు పై గా ధ్వంసం చేసి, కాల్చి వేసిన ముగ్గురు వ్యక్తులు బాలసాని నారాయణ, బాలరాజు,నరేష్ ల పై ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ శాఖ కు ఫిర్యాదు చేసినట్లు గౌడ సంఘం నాయకులు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముగ్గురు వ్యక్తులు తమ పొలంలో ఉన్న తాటి చెట్లను ఎలాంటి అనుమతులు లేకుండా కాల్చి, ధ్వంసం చేసి తమకు ఉపాధి లేకుండా చేసిన వారిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. ఎక్సైజ్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని ధ్వంసం చేసిన తాటి చెట్లను పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్య్రమంలో పట్టణ అధ్యక్షుడు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, బండి లక్ష్మయ్య, బొంగొని రాములు, మద్దికుంట ఎల్లయ్య, గుండెల్లి రాములు, అక్కపల్లి రాజారాం, కొత్తపల్లి బాలయ్య, పెద్దూరి రంగయ్య, పెద్దూరి సత్తయ్య, వేముల రాజేశం, భూంపల్లి శ్రీను, అక్కపల్లి నారాయణ, అక్కపల్లి యాదగిరి, అయోధ్య, దేవేందర్, ఆంజనేయులు, రాజం, దేవరాజు, గుండేల్లి శ్రీనివాస్ తదిరులు పాల్గొన్నారు..