వేములవాడలో వ్యక్తి దారుణ హత్య?
వేములవాడలో వ్యక్తి దారుణ హత్య?
రాజన్నసిరిసిల్లజిల్లా/ వేములవాడ /ముస్తాబాద్/ (వాయిస్ న్యూస్)
డిసెంబర్ 18
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఈరోజు ఉదయం దారుణ హత్య జరిగింది. నూకలమర్రి గ్రామానికి చెందిన రషీద్ (35) అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు కోనయ్యపల్లి రహదారిలో హోండా యాక్టివా షోరూం పక్కనే కత్తులతో విచక్షణా రహి తంగా నరికి చంపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రషీద్ తలతో పాటు మొత్తం 20 చోట్ల దాడి గాట్లు ఉన్నా యని సమాచారం. హత్య చాలా పాశవికంగా జరిగిం దని పోలీసులు తెలిపారు. మృతుడి మృతదేహాన్ని వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించి, పోస్టుమార్టం నిమిత్తం సిద్ధం చేశారు.
మృతునికి భార్య సిరిన్, ఒక కుమారుడు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. దారుణ హత్య నేపథ్యంలో కుటుం బం కన్నీటి పర్యంతమవు తూ…తీవ్ర విషాదంలో మునిగిపోయింది. రషీద్ గంగాధరలో డాక్యుమెంట్ రైటర్‌గా పని చేస్తూ జీవనో పాధి పొందుతున్నాడు.
గుర్తు తెలియని వ్యక్తులు ఈ హత్యకు పాల్పడినట్టు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించేందుకు కసరత్తు చేస్తున్నారు.
హత్యకు గల కారణాలపై దర్యాప్తు ముమ్మరం చేసి నిందితులను త్వరగా గుర్తించి పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ దారుణ హత్య వేముల వాడ పట్టణంలో తీవ్ర కలకలాన్ని రేపింది. దారుణ హత్యతో స్థానికులు భయాందోళనకు గురవు తున్నారు.