అమిత షాదిష్టిబొమ్మ దగ్ధం చేసిన అంబేద్కర్ సంఘ సభ్యులు
అమిత షా
దిష్టిబొమ్మ దగ్ధం చేసిన అంబేద్కర్ సంఘ సభ్యులు
..బాన్సువాడ దిసెం బర్ 19..
. వాయిస్ న్యూస్..
బోర్లం గ్రామంలో అంబేద్కర్ యువజన సంగం అధ్యక్షులు సాయిలు మరియు దళిత సంఘాలనాయకులఆధ్వర్యంలో నిండు పార్లమెంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ పై హేళనగా మాట్లాడి కించపరిచిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ బోర్లం గ్రామంలోని వీధుల గుండా అమిత్యాశ శవయాత్ర తీసి బోర్లం గ్రామ అంబేద్కర్ చౌరస్తా నుండి గ్రామ గాంధీ చౌక్ వరకు ర్యాలీగా వెళ్లి గాంధీ చౌక్ చౌరస్తా లో గురు వారం రోజున దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తూ అమిత్ షాకు వ్యతిరేకం గా నినాదాలు చేశారు . భారతదేశ ప్రజలందరికీ సమాన హక్కులు సర్వమానవవాలి కి సమానంగా చూసిన వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పార్లమెంటు సమావేశాల్లో హేళనగా చేసి మాట్లాడడం నిండు పార్లమెంట్ చట్ట సభకే అవమానంగా భావిస్తూ.. భారత ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలనిఅమిత్ షా ను డిమాండ్ చేశారు. భారత ప్రజలందరి చేత గెలిచిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా బడుగు బలహీన వర్గాల ను కించపరిచినట్టు భావిస్తూ ప్రధాని మోడీ వెంటనే కేంద్ర హోం మంత్రి అమిత్షాను భర్త రఫ్ చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో సంఘ సభ్యులు గ్రామ అంబేద్కర్ సంగం ప్రధాన కార్యదర్శి మన్నె అనిల్ కుమార్. సంఘ సభ్యులు డి రాజ్ కుమార్. దళిత సంఘాల నాయకులు నేర్రె నర్సింలు. మన్నె విట్టల్. మన్నె చిన్న సాయిలు. ఎర్రోళ్ల సాయిలు. కల్లూరి రాజారాం. డాక్టర్ సాయిలు. మన్నె ఐకేపీ సాయిలు. జగ్గా ఆనంద్. మన్నె గంగారాం. దొంతుల గంగారాం. పోతురాజు సాయిలు. బేగరిసెంట్రింగ్ సాయిలు. జె మహేష్ .దిలీప్. విష్ణు వర్ధన్ .లచ్చారామ్. తదితరులు పాల్గొన్నారు