అంతా తానే……. అంతా లోనే…… అయోమయం అనుచరులు
అంతా తానై.. అంతా లోనే..
అయోమాయం అనుచరులు
బుల్డోజర్ల జాడ ఏది ….?
కరీంనగర్ క్రైం, ( వాయిస్ న్యూస్ ) ఫిబ్రవరి 22
బీఆర్ఎస్ నాయకుల అరెస్టులు తెలంగాణ రాష్ట్రా వ్యాప్తంగా హట్ టాపిక్ గా మారింది. అధికారంతో చలరేగిపోయిన వారిని కొమ్ములు విరిచి కటకటాల పాలు చేశారు
కరీంనగర్ పోలీసులు.
ఇప్పటికే దాదాపు 12మందిని అరెస్టు చేసి జైలు పంపారు. తాజాగా మాజీ మంత్రి ప్రధాన అనుచరుడిగా చలమని అవుతున్న నందెల్లి మహిపాల్ తో పాటు మరో 9మంది పై కేసు నమోదు చేసి మంగళవారం శ్రీ కృష్ణ జన్మస్థానానికి పంపారు.
దీంతో అతని అనుచరులు అయోమయంలో పడ్డారు. అధికారం అన్న..దే….. మనం ఏం చేసిన చెల్లుబాటు అవుతుందని అనేక దౌర్జన్యలకు పాల్పడ్డారు.
కాని ప్రస్తుతం అన్నే జైలు వెళ్లే సరికి వీరిలో గుబులు మొదలైంది.
అంతా తానై అంతాలోనే.
అన్ని తానై అధికారాన్ని చేతితో పెట్టుకుని జిల్లా అధికారి స్థాయి నుండి ఠాణాలో కానిస్టేబుల్ వరకు పోస్టింగ్స్ అతని చేతిలోనే ఉండేవి. కట్ చేస్తే ఎన్నికలు వారి కొంప ముంచాయి. అంతలోనే కరీంనగర్ జిల్లా కమీషనరేట్ కు అభిషేక్ మహంతి సిపిగా బాధ్యతలు చేపట్టారు.
దాంతో పాటు ప్రభుత్వం పోవడమే వారికి ప్రస్తుతం శాపంగా మారిందేమో.. దాదాపు 10ఏళ్ల పాటు శాశించిన పోలీసులచే సలాం కొట్టించుకున్న చేతులకే సంకెళ్లు వేసిన. వారు పాల్పడిన నేరాలు ఒక్కొక్కటిగా బయటకు రావడంతో దాదాపు ఇప్పటి వరకు 12మందిని అరెస్టు చేసి జైలుకు పంపారు.
మరి కాంట్రాక్టు తీసుకుని కూలగొట్టే రౌడీల జాడ ఎక్కడ…..?
బుల్డోజర్ల జాడ ఏది…..?
ఇన్ని కూలగొట్టిన వారిపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా కేసులు కాలేదా…?
దీనికి సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు… నిరుపేద కుటుంబాల ఇండ్లు కూలగొడితే బాధ్యులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి చెప్పులు అరిగిన కేసులు కలేదు అప్పుడు మరి ఇప్పుడు ఏం జరుగుతుందో..?
అన్న అధికారంలో ఉండడంతో అనుచరులు ఏం చేసిన కరీంనగర్ లో నడిచింది. అన్న మా వెంట ఉంటే మనలను ఎవ్వరు టచ్ చేయలేరని, వాళ్లు ఏం చేసిన వారిదే పై చేయిగా నిలిచింది. నగరంలో పలు ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేసిన విషయం విదితమే. మరి ప్రస్తుతం ఆ అనుచరులు కాని, ఆ బుల్డోజర్లు కాని ఖాకీలకు కనిపించడం లేదా అని ప్రజలు గుసగులాడుతున్నారు. సాధరణంగా ఎవరైనా దాడి చేసిన, బెదిరించిన పోలీసు స్టేషన్ కు వెళ్తాం.. కాని ఇక్కడ వారే దాడులకు, బెదిరింపులకు పాల్పడతారు.. పోలీసు స్టేషన్లకు పిలిచి కేసులు చేపించారు. అప్పుడు ఓకే ఇప్పుడు అన్న లేడు కదా పరిస్థితేంటని గుండెలు బాదుకుంటున్నారు.
ఈ విజువల్స్ లో కనపడుతున్న వారు ఆయన అనుచరులే.. చెప్పినట్లు వినకపోయిన ఏదైనా ఎదురు చెప్పిన ఇలా దాడి చేసి కొడుతారు.. అన్న చెపితే సరే అక్కడ ఎంత మంది ఉన్న సరే.. స్థలం ఎవరిదైనా సరే.. టార్గెట్ చేస్తే ఇళ్లుకూలిపోవల్సిందే.. దౌర్బగ్యం ఎంటాంటే పోలీసులు అక్కడకు వెళ్లిన ఈ విషయంలో కేసు నమోదు కాలేదు అంటే వారి హవా అప్పుడు ఏ స్థాయి నడిచిందో అద్దం పడుతుంది. దౌర్జన్యం చేస్తూ ఇల్లు కూలుస్తున్నారు జరిగిన ఘటనలపై వార్తలు వస్తున్నాయని రాసిన వారిపై ఫిర్యాదులు ఇచ్చి అధికారుల చే బెదిరించి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి వారి హవా అప్పుడు ఏ స్థాయిలో నడిచిందో అర్థం చేసుకోవచ్చు వారిపై ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారు వేచి చూడాల్సిందే.?
ఏదిఎమైనా 100 గొడ్లను తిన్న రాబందు ఒక గాలివానకు రాలిపడ్డ చందంగా కరీంనగర్ పరిస్థితి ఏర్పడింది. భూ కబ్జాలు, వైట్ కాలర్ నేరాలు, అర్థిక నేరాలకు పాల్పడిన వారిపై విరుచుకుపడుతున్న కరీంనగర ఖాకీలు ఇప్పటికైనా పూర్తి స్థాయిలో భూ కబ్జాకొరులను శిక్షించాలని కొరుతున్నారు కరీంనగర్ కమీషనరేట్ ప్రజలు.