అనుమతలు ఎవ్వరివి.. అద్దెలు ఎవ్వరికి… ?
అనుమతలు ఎవ్వరివి.. అద్దెలు ఎవ్వరికి… ?
కరీంనగర్ ( వాయిస్ న్యూస్ ) జనవరి 15
కరీంనగర్ లో అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు కొరడా ఝులిపిస్తారు.
అవసరమైతే రెవెన్యూ, పోలీసు శాఖ సహకారంతో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తారు కాని అది సామాన్యులకు మాత్రమే.. ఈ ఫోటోలోని అక్రమ కట్టడాలు జిల్లా కేంద్రంలోని సాక్షాత్తూ కలెక్టర్ కార్యాలయం ముందున్న ఎక్సైజ్ భవన సముదాయంలో ప్రహరీ అనుకొని అద్దెల కోసం నిర్మించినవి. అయితే తమది ప్రభుత్వ కార్యాలయమే కదా అని అనుమతులు అవసరం లేవు అనుకున్నారో ఎమో… మున్సిపల్ అధికారులు దీనికి అనుమతులు ఇచ్చారా.. ఒక వేళ అనుతులు లేకపోతే అక్రమ కట్టడాల పై చర్యలు తీసుకుంటారో లేదో చూడాల్సిందే..