ఏటీఎం లో దొంగలు పడ్డారు
ఏటీఎం లో దొంగలు పడ్డారు
గోదావరిఖని ( వాయిస్ న్యూస్ ) ఫిబ్రవరి 10
పక్కా ప్రణాళికతో సినీ ఫక్కీలో దర్జాగా గ్యాస్ కట్టర్లతో దొంగలు రెండు ఏటీఎంలు లూటీ చేసిన సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లో జరిగింది.
పూర్తి వివరాల్లోకి వెళితే గోదావరిఖని పట్టణంలోని గౌతమినగర్, గంగానగర్ లలో రెండు ఎటిఎంల చోరికి తెగబడ్డారు. గౌతమినగర్ ఎటిఎం సిసి కెమెరాలో రికార్డు కాకుండా కెమెరా ల పై స్ప్రే చేసిన అనంతరం నగదును దోచుకుపోయారు. గంగానగర్ ఎటిఎంలో దొంగతనానికి ప్రయత్నం చేసి విఫలమయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే చోరి జరిగిన ఎటిఎంలను పరిశీలించి, గాలింపు చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించిన గోదావరిఖని ఎసిపి తుల శ్రీనివాస్ రావు. ఫింగర్ ప్రింట్స్ ఆదారంగా దొంగలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.