ప్రైవేటు కళాశాలలకు ధీటుగా బాన్సువాడ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల
ప్రైవేటు కళాశాలలకు ధీటుగా బాన్సువాడ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల
వచ్చే విద్యా సంవత్సరం కోసం ఇప్పటినుంచే ప్రణాళిక.
సుమారు 2,000 కరపత్రాలు ప్రచురించి అడ్మిషన్ డ్రైవ్ ప్రారంభించిన ప్రిన్సిపాల్ అసద్ ఫారూఖ్ మరియు సిబ్బంది.
..బాన్సువాడ దిసెంబర్ 19..
.. వాయిస్ న్యూస్.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మరియు సిబ్బంది వచ్చే విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ అడ్మిషన్ల కోసం ఇప్పటి నుంచే ప్రణాళిక రచించుకున్నారు. సుమారు 2000 కరపత్రాలను ప్రచురించి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థినిలకు ఇంటర్ లో అడ్మిషన్ పొందే విధంగా కృషి చేస్తున్నారు. అధ్యాపకులు అందరూ కలిసి రూట్ మ్యాప్ తయారుచేసుకొని ప్రతి గ్రామ గ్రామాన ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు వెళ్తూ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, బాన్సువాడ యొక్క ప్రత్యేకతలను వివరిస్తూ పదవ తరగతి విద్యార్థులు వచ్చే సంవత్సరం ఇంటర్మీడియట్ అడ్మిషన్ బాలికల జూనియర్ కళాశాలలో పొందే విధంగా ప్రయత్నం మొదలుపెట్టారు.
అడ్మిషన్ డ్రైవ్ లో భాగంగా ఈరోజు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల బాన్సువాడకు అధ్యాపకులు ప్రిన్సిపల్ వెళ్లి అడ్మిషన్ క్యాంపెయిన్ నిర్వహించారు. నేటి కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అసద్ ఫారుక్, అధ్యాపకులు శ్రీనివాస్, గంగాధర్, రమేష్, పద్మ, రమ్యశ్రీ, స్వప్న, కీర్తి, వైశాలి, క్రాంతి, జాఫర్, రఘురాం, కవిత, ఆయేషా, అనుపమ, కళాశాల జూనియర్ అసిస్టెంట్ అబ్దుల్ రజాక్ తదితరులు పాల్గొన్నారు.