చికెన్ వేస్ట్ టెండర్ పెట్టండి
చికెన్ వేస్ట్ టెండర్ పెట్టండి
వారహి ఆగ్రోను బెదిరించి టెండర్ రద్దు చేయించిన కాంగ్రెస్ నాయకులు
గోదావరిఖని ( వాయిస్ న్యూస్ ) పిబ్రవరి 11
రామగుండం కార్పొరేషన్ లో వేస్ట్ యేజ్ చికెన్ సేకరణ టెండర్ నిలిపివేయటంతో కార్పోరేషన్ ఖజానకు గండిపడుతుంది.గత ఏడాది కరీంనగర్ కు చెందిన వారహి ఆగ్రోవిట్ ఏజన్సీ టెండర్ దక్కించుకొని గోదావరిఖని చికెన్ మార్కెట్ తో పాటు చుట్టు ప్రక్కల 149 షాపుల నుండి చికెన్ వేస్ట్ యేజ్ ను సేకరించి తీసుక వెళ్లేవారు.కాని రామగుండం కు చెందిన కొంతమంది కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సదరు కాంట్రాక్టర్ ను బెదిరింపులు గురి చేసి బలవంతంగా టెండర్ ను రద్దు చేయించారు.అంతే కాకుండా బసంతనగర్ టోల్ గేటు వద్ద చికెన్ వేస్టయేజ్ ఆటోలను అడ్డుకొని దాడులకు దిగిన్నట్లు తెలుస్తుంది. చికిన్ వెస్ట్ యేజ్ కోసం వారహి ఏజన్సీ కాంట్రాక్టర్ ఒక్కొక్క షాపుకు 1400 చొప్పున రెండు లక్షల రూపాయలు చెల్లిస్తున్నాడు.కాంగ్రెస్ నాయకులు కాంట్రాక్టర్ చేత బలవంతంగా ఒప్పందం రద్దు చేయించారు. చికెన్ వేస్ట్ యేజ్ తరలింపు టెండర్ పెట్టేందుకు కమీషనర్ చర్యలు తీసుకోవాలని వ్యాపారులు కోరుతున్నారు.