జిల్లా నాయకులు మల్లారపు అరుణ్ కుమార్… వాయిస్ న్యూస్ వీర్నపల్లి : వీర్నపల్లి మండలకేంద్రంలో శనివారం భారత కమ్యూనిస్టు పార్టీ( మార్క్సిస్టు,) సిపిఎం పార్టీ జిల్లా మహాసభలు ఈనెల 19 20 రాజన్న సిరిసిల్ల జిల్లాలో షాదీ ఖానా హాల్లో జరుగుతున్నాయని, సభలను విజయవంతం చేయాలని కరపత్రలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మల్లారపు అరుణ్ కుమార్ మాట్లాడుతూ, పేద ప్రజల పక్షనా నిలబడినా జెండా ఎర్ర జెండా అని అన్నారు. పేద ప్రజలు కోసం ఎన్నో పోరాటాలు ఎన్నో త్యాగాలు చేసిందని అన్నారు జిల్లా వ్యాప్తంగా ఎన్నో పోరాటలు చేస్తుందని ఈ జిల్లా మహాసభలో కూడా కార్మికుల ప్రజలు సమస్యల పరిష్కారం కోసం పలు తీర్మానలు చేస్తుందని అన్నారు.ఈ సభలకు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలనీ అన్నారు కార్యక్రమంలో నరేందర్ దేవయ్య,రాజేల్లయ్య,చంద్రయ్య,అంజయ్య దేవరాజు తదితరులు పాల్గొన్నారు