భక్తుల సౌకర్యార్థం అరుణాచలం యాత్ర చేపట్టినట్లు…డిపో మేనేజర్ నాగభూషణం తెలిపారు
భక్తుల సౌకర్యార్థం అరుణాచలం యాత్ర చేపట్టినట్లు…డిపో మేనేజర్ నాగభూషణం తెలిపారు.
పెద్దపల్లి (వాయిస్ న్యూస్) నవంబర్ 09
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శనివారం రోజున గోదావరిఖని బస్సు డిపో మేనేజర్ అరుణాచలం యాత్ర పై కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ నాగభూషణం మాట్లాడుతూ ఈనెల 13వ తేదీన గోదావరిఖని బస్సు డిపో నుండి అరుణాచలం యాత్ర చేపడుతున్నట్టు ఒకరికి 4850 రూపాయలు ఉంటుందని భక్తులు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ద్వార ఈ యాత్ర చేపడుతున్నట్టు, కార్తీక మాసం సందర్భంగా వివిధ యాత్రలు అనగా శబరిమల తిరుపతి పలు పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు భక్తులకు అతి తక్కువ ధరలతో గోదావరిఖని ఆర్టీసీ డిపో ద్వారా ఏర్పాటు చేస్తున్నామని అనుభవజ్ఞులైన బస్సు డ్రైవర్లు ఉంటారని వివిధ యాత్రల చేపట్టేవారు ఆర్టీసీ బస్సులను వినియోగించుకోవాలని సూచించారు. గోదావరిఖని ఆర్టీసీ డిపో మేనేజర్..