పర్మిషన్ లేకుండా పాఠశాల బస్సు ప్రచారానికి
పాఠశాలల బస్సులు ఎలాంటి పర్మిషన్ లేకుండా యాదగిరి శేఖర్ రావు(ఎమ్మెల్సీ అభ్యర్థి) ప్రచారానికి వాడటం సిగ్గు చేటు
యాదగిరి శేఖర్ రావుకు కొమ్ము కాస్తున్న పాఠశాలల యాజమాన్యాలు
–సామాజిక కార్యకర్త గట్టు సాయిరాం
జమ్మికుంట( వాయిస్ న్యూస్) డిసెంబర్ 18:
జమ్మికుంట పట్టణంలో పలు పాఠశాలల బస్సులు యాదగిరి శేఖర్ రావు ప్రచారానికి వాడుతున్నారని సామాజిక కార్యకర్త గట్టు సాయిరాం అన్నారు. MLC ఎన్నికల అభ్యర్థులను ప్రకటించక ముందే యాదగిరి శేఖర్ రావు ఎలాంటి పర్మిషన్ లేకుండా ప్రచారం బడి బస్సులతో మొదలు పెట్టారు. అంతగా ప్రచారం చేసుకోవాలంటే ఏ ఆటోలకో మైకులు పెట్టో, స్టీక్కెర్లు వేసి చేసుకోవాలి కానీ ఇలా విద్యార్థులు పోయే బస్సులకు స్టీక్కెర్లు వేసి ప్రచారం చెయ్యడాం సిగ్గు చేటు అన్నారు. ఈ విషయం లో యాదగిరి శేఖర్ రావును పట్టభద్రుల అభ్యర్థిగా అర్హత లేదు అని తెలియజేసారు. అస్సలు ఈ విషయాన్ని చూసి చూడనట్లు గా వ్యహరిస్తున్న విద్యాధికారులు మరియు వేకిల్ ఇన్స్పెక్టర్ ఈ విషయం పై తక్షణేమే జిల్లా కలెక్టర్ స్పందించి ఆ పాఠశాలల యొక్క బస్సులను సీజ్ చేసి పాఠశాలల యొక్క గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాము, లేని యెడల ఆందోళన పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాము.