ఇటుక బట్టి కార్మికులను చితకబాదిన ఇటుక బట్టి యజమాని.
ఇటుక బట్టి కార్మికులను చితకబాదిన ఇటుక బట్టి యజమాని.
పెద్దపల్లి ( వాయిస్ న్యూస్ ) ఫిబ్రవరి 9
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కాసారం గ్రామపంచాయతీ పరిధిలోని సైండ్ల అఖిల్, విష్ణు కు చెందిన ఇటుక బట్టి లో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులను పని గంటలు ఎక్కువగా చేయిస్తూ పని చేయకపోతే మూడు రోజులకు ఒకసారి ఇష్టం వచ్చినట్లుగా కొడుతు, నానా బూతులు తిడుతూ, వేడివేడి ఇట్టుకలను మా చేత తీస్తున్నారని దానివల్ల చేతులు కాలుతున్నాయని, ఈ దృశ్యాలన్నీ అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయని కార్మికులు వాపోయారు. సాయంత్రం వేళ ముగ్గురు కార్మికులను ఇష్టం వచ్చినట్లుగా కొట్టడంతో కార్మికులందరూ సమీప రామగిరి పోలీస్ స్టేషన్ కు కార్మికులందరూ చేరుకొని ఇటుక బట్టి యజమాని విష్ణు పై ఫిర్యాదు చేయగా రామగిరి పోలీసులు విష్ణు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు