గోదావరిఖనిలో భోగి సంబరాలు ఘనంగా
గోదావరిఖనిలో భోగి సంబరాలు ఘనంగా
పెద్దపల్లి ( వాయిస్ న్యూస్ ) జనవరి 14
పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో భోగి సంబరాలు ఘనంగా నిర్వహించారు.గోదావరిఖని ప్రధాన చౌరస్తా లో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ భోగి మంటలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకోవాలన్నారు.గత జ్ఞాపకాలను వదిలడానికి పాత వస్తువులను భోగి మంటల్లో వేస్తారని చెప్పారు.రామగుండం ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం నిర్వహించిన గంగిరెద్దుల విన్యాసాలు పలువురిని ఆకట్టుకున్నాయి.