December 23, 2024

karinmangar voice

telugu news

పాలకమండలి లేక పదేళ్లు..

Spread the love

పాలకమండలి లేక పదేళ్లు..

  • భద్రాచల రామాలయ పాలకమండలి ఏర్పాటు చేయాలి..
  • గిరిజనున్ని పాలకమండలి చైర్మన్ గా నియమించాలి.
  • స్థానిక గిరిజన, గిరిజనేతర భక్తులకు పాలకమండలిలో చోటు కల్పించాలి.
  • రామాలయ భూములు కాపాడాలంటే స్థానికులకే సాధ్యం.
  • పాలకమండలి ఏర్పాటుతో ఆలయ అభివృద్ధి సాధ్యం.

టి జె ఎస్ పార్టీ భద్రాచల కోఆర్డినేటర్.
పూనెం ప్రదీప్ కుమార్.

భద్రాద్రి కొత్తగూడెం (వాయిస్ న్యూస్)
నవంబర్ 9

భద్రాచలం పట్టణంలో నెలకొన్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం నందు తక్షణమే పాలకమండలిని ఏర్పాటు చేయాలని తెలంగాణ జన సమితి పార్టీ భద్రాచలం నియోజకవర్గ కోఆర్డినేటర్ పూనెం ప్రదీప్ కుమార్ డిమాండ్ చేశారు. గత పది సంవత్సరాలుగా పాలకమండలి లేకపోవడం వలన ఆలయ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరగకుండా పోయాయని ఆయన అన్నారు. రామాలయ పాలకమండలిలో భద్రాచలం ప్రాంత వాసులకు 50 శాతం గిరిజన, గిరిజనేతర రామ భక్తులకు స్థానం కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధిగాంచిన భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారు నెలకొన్న కారణంగా ఆలయ పాలకమండలి చైర్మన్ గా గిరిజన వ్యక్తిని నియమించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ ఆలయ అభివృద్ధి కోసం ఇక్కడ వ్యక్తులైతే విశేషంగా కృషి చేస్తారని, ఈ ఆలయ పాలకమండలిలో గిరిజన, గిరిజనేతర ప్రజలకు సముచితమైన స్థానం కల్పించాలని ఆయన కోరారు. ఆంధ్రాలో కలిసిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం భూములు తిరిగి తెలంగాణలో కలిపేందుకు పోరాటం చేయాలంటే స్థానికంగా ఉన్న గిరిజన, గిరిజనేతర ప్రజలతోనే సాధ్యపడుతుందని, ఆ విధంగా జరిగేందుకు స్థానిక రామభక్తులకు పాలకమండలిలో సముచిత స్థానం కల్పించడం వలన ఆలయ భూములకు తిరిగి తెలంగాణలో కలిపేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తప్పనిసరిగా ఈ సంవత్సరమే పాలక మండలిని ఏర్పాటు చేసి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటు, చేయూత అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Copyright © All rights reserved by KARIMNAGAR VOICE NEWS | Newsphere by AF themes.