దళిత బంధు రెండో విడత రాని వారి దళితల కుటుంబాల ధర్నాతో దద్దరిల్లిన హుజురాబాద్ చౌరస్తా
దళిత బంధు రెండో విడత రాని వారి దళితల కుటుంబాల ధర్నాతో దద్దరిల్లిన హుజురాబాద్ చౌరస్తా
వేల మంది దళితులతో ధర్నాకు కదిలిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
దళిత కుటుంబాలు పిలుపు మేరకు హుజురాబాద్ చౌరస్తాలా అంబేద్కర్ కి పూలమాలవేసి ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
ధర్నాని అడ్డుకొని ఎమ్మెల్యే, దళితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
దళిత బంధు రెండో విడత వెంటనే విడుదల చేయాలంటూ, రెండో విడతకు సంబంధించి శనివారం హుజురాబాద్ లోని ఎమ్మెల్యే ఇంటి వద్ద ఏర్పాటుచేసిన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి పెద్ద ఎత్తున దళితుల దళితుల కుటుంబాలు హాజరయ్యాయి. దరఖాస్తుల స్వీకరణ మొదలు పెట్టకముందే కొంతమంది దళితులు కౌశిక్ రెడ్డిని మీరు మా మా వెంట అంబేద్కర్ చౌరస్తాకు వచ్చి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి అనంతరం ధర్నా చేసి దరఖాస్తు స్వీకరణ చేస్తే బాగుంటుందని అన్నారు. దళితులను ఉద్దేశించి కౌశిక్ రెడ్డి ప్రసంగం ప్రారంభించడంతో దళిత బందు కోసం మా వెంట ఉంటారా మాకోసం పోరాడుతారా లేదా అంటూ దళితులంతా ముక్తకంఠంతో కోరగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ప్రాణమైన ఇస్తా మీకోసం అని చెప్పారు. అనుకున్నదే తడువుగా దళితను అందరితో కలిసి ధర్నా కోసం చౌరస్తా వైపు కదిలారు. ఇంట్లోంచి బయటకు వస్తున్న కౌశిక్ రెడ్డిని పోలీసులు నిలువరించాలని చూసిన ఎంతకు వినకుండా వేల మందిని వెంట వేసుకొని అంబేద్కర్ చౌరస్తా కు కదిలాడు. అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం డప్పు కొడుతూ ధర్నాకు దిగారు. పోలీసులు ఎంత వారించినా దళితులు సైతం పోలీసులతో వాగ్వాదానికి దిగి తమకు రెండవేళ దళిత బంద్ వెంటనే అందించాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ధర్నాకు దిగిన కౌశిక్ రెడ్డికి పోలీసులకు మధ్య తీవ్ర వాగ్దానం జరిగింది. పోలీసులు ఎంత ప్రయత్నించినా కౌశిక్ రెడ్డి వినకుండా ధర్నాకు దిగారు. కౌశిక్ రెడ్డిని అరెస్టు చేసేందుకు పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా దళితులంతా అడ్డుగా నిలుచున్నారు. కొంతమంది పోలీసులు తీసుకువచ్చిన వాహనాలకు అడ్డం పడుకొని తమ నిరసన వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి కౌశిక్ రెడ్డిని నాటకీ అప్పటి నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేశారు. అనంతరం కోపంతో రగిలిపోయిన దళితులంతా కలిసి ప్రభుత్వానికి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చౌరస్తాలో బైటాయించారు. కౌశిక్ రెడ్డి వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా దళితులంతా కలిసి మా కోసం కొట్లాడే నాయకున్ని ఎలా అరెస్టు చేస్తారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సుమారు రెండు గంటల పాటు పోలీసులు ఎంత నెట్టేసిన తిరిగి ధర్నాకు దిగారు. ఒకవైపు పోలీసులు ధర్నా విరమింప చేస్తుంటే మరోవైపు మరికొంతమంది వచ్చి ధర్నాకు కూర్చున్నారు. ధర్నాకు దిగిన దళితులు ఎంతకు వినకపోవడంతో కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జి తో పాటు హుజురాబాద్ జమ్మికుంట సిఐలు తిరుమల్ గౌడ్, వరగంటి రవి దన్నను విరివింపజేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, హుజురాబాద్ మునిసిపల్ చైర్ పర్సన్ గందే రాధిక శ్రీనివాస్, తాళ్లపల్లి శ్రీనివాస్, మొలుగు సృజన, పూర్ణచందర్, మారెపల్లి సుశీల తోపాటు దళిత సంఘాల నాయకులు దళితులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు అస్వస్థత….
దళిత బంధు రెండో విడత విడుదల చేయాలంటూ ధర్నాకు దిగిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కి పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో ఎమ్మెల్యే అస్వస్థతకు గురయ్యారు. తోపులాటలో అస్వస్థతకు గురైన ఎమ్మెల్యేను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స అందించారు.
కేసులు పెట్టిన, ప్రాణం పోయినా దళితులకు అండగా ఉంటా
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
దళిత బంధు రెండో విడత విడుదల సందర్భంగా అస్వస్థతకు గురి అయిన అనంతరం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తనపై ఎన్ని కేసులు పెట్టిన చివరకు తన ప్రాణం పోయినా దళితులకు అండగా ఉంటానని ఆయన అన్నారు. దళిత బంధు రెండో విడత విడుదల చేసే వరకు ఊరుకునేది లేదని అన్నారు. ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి దళిత కుటుంబాలకు ఒక్క కుటుంబానికి 12 లక్షలు ఇస్తానని చెప్పారని, వెంటనే ప్రతి దళితునికి 12 లక్షలు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హుజురాబాద్ నియోజకవర్గం లోని రెండో విడత దళిత బంధు బాధితులందరికీ కెసిఆర్ వారి అకౌంట్లో వేసిన పదిలక్షలను ఫ్రిజింగ్ ఎత్తివేసి వారికి ఇవ్వాలని అన్నారు. దళిత బందు ఇవ్వకుంటే ఇంతకంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.