జాతీయ రహదారి అధికారుల నిర్లక్ష్యంతో యువకుడు మృతి
జాతీయ రహదారి అధికారుల నిర్లక్ష్యంతో యువకుడు మృతి
జగిత్యాల ( వాయిస్ న్యూస్ ) జనవరి 14
ద్విచక్ర వాహనం ఫోర్ వే లైన్ గుంతలో పడి ఒకరు మృతి- మరొకరికి తీవ్ర గాయాలు
ఓ యువకుడి ప్రాణం తీసిన జాతీయ రహదారి ఫోర్ వే లైన్ గుంత
ఫోర్ వే లైన్ నిర్మాణ పనుల్లో రోడ్డుకడ్డంగా ఉంచిన బారికేడ్ ఢీ కొని యువకుడి మృతి
నిజామాబాద్-జగ్దల్ పూర్ జాతీయ రహదారి పనుల మరమ్మత్తులు గత కొద్ది రోజులనుంచి జరుగుతున్నాయి.
ఇందులో భాగంగా కోరుట్ల వైపు నుంచి జగిత్యాలకు తన స్నేహితుడి బర్త్ డే సందర్భంగా..తన స్నేహితుడిని వెంటబెట్టుకుని మోటార్ సైకిల్ పై వస్తున్న యువకుడు శనివారం రాత్రి సుమారు 12 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలు కాగా, మరో యువకుడు గాయాలపాలై, ప్రాణాపాయంనుండి బయటపడ్డాడు. వివరాల్లోకి వెళితే…
జగిత్యాల జిల్లా కేంద్రానికి సమీపంలో సుమారు రెండు కి.మీ దూరంలో నున్న సుబి ఐస్ ఫ్యాక్టరీ సమీపంలో గల ఫోర్ వే లైన్ గుంతలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు జాతీయ రహదారి పనుల ఫోర్ వే లైన్ నిర్మాణ పనులకు సంబంధించి, బారికేడ్ బోర్డును వేగంగా ఢీకొట్టడంతో బాలరాజు (24) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, బాలరాజు స్నేహితుడు నవీన్ కు గాయాలై, ప్రాణాపాయంనుంచి బయటపడ్డాడు.
నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం బషీరాబాద్ గ్రామం కు చెందిన బాలరాజు తన స్నేహితుడు నవీన్ తో కలిసి ఇద్దరూ ద్వి చక్రవాహనంపై జగిత్యాల పట్టణం విద్యానగర్ కు చెందిన తన స్నేహితుడి పుట్టినరోజు సందర్భంగా కలవడానికి వచ్చే సమయంలో ఈ ఘటన జరిగిందని, రోడ్డు ప్రమాదంనుంచి బయటపడ్డ నవీన్ తెలిపాడు. ప్రమాదం జరిగిన వెంటనే గమనించిన స్థానికులు 108 అంబులెన్స్ లో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన బాలరాజు శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం పోలీసులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.