కలికోట చెక్ పోస్ట్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
కలికోట చెక్ పోస్ట్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
జగిత్యాల ప్రతినిధి, (వాయిస్ న్యూస్), నవంబర్ 14 :
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా వాహన తనిఖీలు విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. కథలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన కలికోట డిస్ట్రిక్ట్ బార్డర్ చెక్ పోస్ట్ ను జిల్లా ఎస్పి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ…. ఎన్నికల ప్రవర్తన నియమావళిని జిల్లాలో కట్టుదిట్టంగా అమలు చేస్తామని, నగదు, మద్యంపై ఉచిత పంపిణీలపై ప్రత్యేక నిఘా ఉంటుందని ఎన్నికల నియమావళి అమల్లోకి ఉన్నందున పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎన్ఫోర్స్మెంట్ వర్క్ జరుగుతుందని, ఎవరూ ఓటర్లను ప్రలోభపెట్టే ఏలాంటి చర్యల కు దిగవద్దని, పట్టుబడితే సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామన్నారు. సరైన ఆధారాలు లేకుండా ఎక్కువ మొత్తం లో డబ్బులను తీసుకెళ్తే సీజ్ చేస్తామన్నారు. చెక్ పోస్ట్ సిబ్బంది వాహనాల తనిఖీ పకడ్బందీగా నిర్వహించాలని, అప్రమత్తoగా వ్యవహరించాలని, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని అధికారులకు, సిబ్బందికి ఎస్పి సూచించారు.