మేడారం శ్రీ సమ్మక్క-సారలమ్మలకు మొక్కు చెల్లించుకున్న యువజన కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు
మొక్కు చెల్లించుకున్న యువజన కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు
మేడారం శ్రీ సమ్మక్క-సారలమ్మలకు మొక్కు చెల్లించుకున్న యువజన కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పరశురాములు గౌడ్
సిద్దిపేట్ / బెజ్జంకి: ( వాయిస్ న్యూస్ ) డిసెంబర్ 10
బెజ్జంకి మండలంలోని గుండారం గ్రామానికి చెందిన యువజన కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పరకాల పరశురాములు గౌడ్ డాక్టరు కవ్వంపల్లి సత్యనారాయణ భారీ మెజారిటీతో గెలుపొందిన సందర్భంగా శ్రీ మేడారం సమ్మక్క- సారలమ్మ తల్లులను దర్శించుకోవడం జరిగింది పరశురాముడు గౌడ్ మాట్లాడుతూ కవ్వంపల్లి సత్యనారాయణ గెలుపు కోసం 9 సంవత్సరాల నుండి ఎన్నో కష్టాలు పడ్డామని ఇన్ని రోజులకు తమ కష్టానికి ప్రతిఫలం దక్కిందని అమ్మ వార్ల దీవెన మానకొండూరు ప్రజల ఆశీర్వాదంతో డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ భారీ మెజారిటీతో గెలిచారని ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవార్లను మొక్కుకున్నానని ఆయన తెలిపారు