ఊరేగింపులకు పండగలకు అడ్డంకిగా మారిన డ్రైనేజీ వెలికితీత
ఊరేగింపులకు పండగలకు అడ్డంకిగా మారిన డ్రైనేజీ వెలికితీత
జగిత్యాల. ( వాయిస్ న్యూస్ ).జనవరి 22
జగిత్యాల పట్టణం మార్కండేయ ఆలయ ఆవరణలో మున్సిపల్ కాంప్లెక్స్ కు మరియు మార్కండేయ టెంపుల్ కమాన్ కు ఇరువైపులా గల డ్రైనేజీ నుండి తీసిన చెత్త చెదారం తీసి రోడ్డుకు ఇరువైపులా వేయడం గమనించిన ఆలయ భక్తులు, ఆధ్యాత్మికులు, వీధిలో ఉన్న ప్రజలు రోడ్డుకు ఇరువైపులా వేసిన చెత్తాచెదారాన్ని వెనువెంటనే తీసివేయాలని క్షేత్రస్థాయి అధికారికి ఫిర్యాదు చేయగా స్పందించిన అధికారులు వెనువెంటనే మున్సిపల్ కార్యాలయం నుండి వచ్చిన ట్రాక్టర్ చెత్తా చెదారాన్ని వాహనంలో తీసుకెళ్లారు. ఈ తతంగం గమనించిన ఓ యువకుడు ఆలయ ఊరేగింపులకు పండుగలకు ఒకరోజు ముందు చెత్తచెదారాన్ని రోడ్డుకు ఇరువైపులా వేసి ఉంచి శోభయాత్రలకు ఇబ్బంది కలిగేలా చేయడం సరికాదని, సోమవారం అయోధ్యలో రాములవారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట ను పురస్కరించుకొని మార్కండేయ ఆలయం నుంచి ఊరేగింపుకు సన్నాహాలు చేస్తున్న సమయంలో డ్రైనేజీ నుండి తీసిన చెత్తాచెదారం లోని మురికి నీరు ఇంకిపోయే వరకు కనీసం ఒకటి రెండు రోజులు అలాగే ఉంచుతారని తద్వారా ఊరేగింపు చేసే సమయంలో అక్కడే తీసి ఉంచిన చెత్త చెదారంలోనే నడవవలసి వస్తుందని గమనించిన తరుణంలో ఉన్నతాధికారులకు తెలియజేయడం జరిగిందని తెలిపారు. ఇకనైనా ఇట్టి విషయం గమనించి పండగలకు ఊరేగింపులకు శోభయాత్రులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా డ్రైనేజీ శుద్ధి కార్యక్రమాన్ని చేసుకోవాలని అధికారులను మునిసిపల్ పారిశుద్ధ్య సిబ్బందిని కోరుకున్నాడు.