మొరాయిస్తున్న మహేంద్ర వాహనాలు
మురాస్తున్న మహేంద్ర వాహనాలు
మహేంద్ర కంపెనీ ట్రక్కు కొనుక్కున్న కస్టమర్లకు తంటాలు
కరీంనగర్ ( వాయిస్ న్యూస్ ) ఫిబ్రవరి 09
పేరుకు బ్రాండెడ్ కంపెనీ.. కంపెనీ కున్న బ్రాండ్ ఇమేజ్ ను చూసి వాహనాలు కొనుక్కుంటున్నారు వినియోగదారులు..
కానీ షోరూం నిర్వాహకుల తీరుతో కస్టమర్లు నానా తిప్పలు పడుతున్నారు. కరీంనగర్ లోని మహేంద్ర షోరూం లో బుల్లోరా ట్రక్ ను కొనుగోలు చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా కు చెందిన కస్టమర్ కీర్తన్ కి షోరూం ముందు నిరసనకు దిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది..
పూర్తి వివరాల్లోకి వెళితే సిద్దిపేట జిల్లాకు చెందిన కీర్తన్ అనే వ్యక్తి గత నెల కరీంనగర్ మహేంద్ర షోరూమ్ లో మహేంద్ర ట్రక్ కోసమని డౌన్ పేమెంట్ అమౌంట్ కట్టి కొనుక్కున్నాడు. కొనుగోలు చేసి వారం రోజులు కూడా గడవకముందే రోడ్డుపై వెళ్తున్న మహేంద్ర ట్రక్కు యొక్క టైరు ఊడిపోవడంతో షాక్ తిన్న కస్టమర్ కీర్తన్ తన వాహనాన్ని షోరూమ్ కు తీసుకురాగా షోరూం నిర్వాహకులు వారం రోజుల టైం తీసుకుని రిపేర్ చేసి ఇచ్చారు. అనంతరం మళ్ళీ వారం రోజులకే టైర్లు వేడెక్కి వాహన చక్రాలు హీట్ అవుతున్నాయని షోరూమ్ కు వాహనాన్ని తెచ్చాడు. మళ్లీ మళ్లీ ట్రక్ వాహనం ఇలా రిపేర్ వస్తుంటే వాహనం ఎలా నడుపుకోవాలని, నెల నెలా ఈఎంఐ లు ఎలా కట్టుకోవాలని షోరూం నిర్వహకులతో వాగ్వాదానికి దిగాడు. దీనికి స్పందించిన మహీంద్రా షోరూం యాజమాన్యం రిపేర్ చేసి ఇవ్వడమే మా బాధ్యత అని నిర్లక్ష్యంగా సమాధానమివ్వడంతో ఆవేదన చెందిన కస్టమర్ కీర్తన్ ట్రక్కు నడిపుతూ జీవనం గడుపుకుందామనుకుంటే వాహనం కొని నెల తిరగకముందే ఇలా రిపేర్లు వస్తుంటే ఎలా అంటూ వాపోయాడు. కొత్త వాహనానికి అప్పులు చేసి కిస్తీ లు కడుతున్నానని ఈ వాహనం నాకొద్దు అంటూ షోరూం ముందు గోడు వెళ్లబోసుకున్నాడు. షోరూం యాజమాన్యం మాత్రం రిపేర్ చేసి ఇవ్వడం వరకే మా రెస్పాన్సిబిలిటీ అంటూనే మనుషులకే గ్యారెంటీ లేదు వాహనాలకు గ్యారంటీ ఉంటుందా అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడటం షోరూం నిర్వాహకుల అహంకారానికి పరాకాష్టగా నిలిచింది. వినియోగదారుల పట్ల బాధ్యత గా వ్యవహరించాల్సిన మహేంద్ర షోరూం యాజమాన్యం తన ఇష్టార్జిన కస్టమర్లను ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తుండడంతో వినియోగదారుల కమిషన్ స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు