పోలీసుల అదుపులో మాజీ మంత్రి అనుచరుడు
పోలీసుల అదుపులో మాజీ మంత్రి అనుచరుడు
కరీంనగర్ ( వాయిస్ న్యూస్ ) ఫిబ్రవరి 20
కరీంనగర్ పోలీసుల అదుపులో మరో కీలక నేత ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే పలు ఆరోపణలతో కార్పోరేటర్ లను అరెస్టు చేసిన విషయం తెలిసినదే.
గతంలో తన కనుసైగల్లో సెటిల్మెంట్లు నగరంలో, తను చెప్పిందే వేదంగా, తను తలచిందే అదేశంగా నగరం నడిబొడ్డున ఓ ఆఫీసు తెరచి ఆ ఆఫీసులోనే నగరంలోని అన్ని సెటిల్మెంట్లు తన కనుసైగల్లోనే జరుగుతాయి అని కూడా గుసగుసలు బయటికి రాకపోలేదు. నగరంలో తను ఏ ఫంక్షన్ వెళ్ళిన మంత్రి కన్నా ఎక్కువ హడావిడిగా తన వెంట బౌన్సర్లు లేకుండా పోవడమనేది జరిగేది కాదు.
అనుచరులపై ఎవరైనా అక్రమాలు చేస్తున్నారని అన్యాయాలు జరుగుతున్నాయని వార్తలు రాసిన జర్నలిస్టులను బెదిరించడమే కాకుండా వాళ్లపై ఎస్సీ ఎస్టీ అక్రమ కేసులు పెట్టి వేదిస్తారనే పేరుంది.
కొందరు అధికారులైతే వీరితోనే సెటిల్మెంట్లు చేయించుకున్నట్లు ఇండ్లు కూలగొట్టించినట్లు సమాచారం. గతంలో అయితే కోకొల్లలుగా వార్తలు రాసినప్పటికీ దేనికి బాధితుల పిటీషన్లకు స్పందించకపోవడంతో
ప్రజలు విసుగెత్తి భగవంతుడి పై భారం వేసి మిన్నకుండిపోయిన సందర్భాలు కోకొల్లలు. గతంలో ఈయన మీద వచ్చిన ఆరోపణలు తెలిస్తే ఎలాంటి అధికారం లేని వ్యక్తి ఒక జిల్లాని శాసించే రీతిలో వ్యవహరించిన తీరు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పోలీసు అధికారుల పోస్టింగ్ లు, ఇతర కీలక శాఖల పోస్టింగ్ లు సైతం ఈయన ఆశీసులు ఉన్నవారికి దక్కడం ఈయన అజమాయిషీ కి దర్పణం పడుతోంది. తను ప్రత్యక్షంగా ఫీల్డ్ మీద కనబడకుండా తన అనుచరుల ద్వారా బుల్డోజర్లు పెట్టి ఇళ్ళు కూల్చేసిన ఘటనలు ప్రజల కళ్ళ ముందే కనబడుతున్నాయి. ఈ దరిమిలా ప్రజలు ఆ భగవంతుడి మీద నమ్మకంతో ఉండగా భగవంతుడే కరీంనగర్ ప్రజల గోస చూడలేక సిపి అభిషేక్ మహంతిని పంపించాడని ప్రజలు సిపి అభిషేక్ మహంతిని దేవుడి ఫోటోలు పక్కన పెట్టి కొలుస్తున్నారు. దానికి నిదర్శనమన్నట్లుగా గతంలో అధికారులు ఈ అనుచరుడి ఇంటిముందే పడిగాపులు కాసేవారు..ఇప్పుడు మాత్రం చట్టం ఎవరికి చుట్టం కాదు, రూల్ ఇస్ రూల్ రూల్ ఫర్ ఆల్ అన్నట్లుగా సిపి అభిషేక్ మహంతి వ్యవహార శైలిని నగర ప్రజలు అభినందిస్తున్నారు. మాజీ మంత్రి ముఖ్య అనుచరుడిని కొందరు బాధితుల ఫిర్యాదు మేరకు ఎంక్వయిరీ పేరుతో స్టేషన్ కు తరలించడంతో బాధితులు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
మంగళవారం ఉదయం కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. బాధితులు కొంతమంది కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతిని ఆశ్రయించడంతో వివిధ కోణాల్లో విచారించి మాజీ మంత్రి అనుచరుని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.