పోలీసులకు లొంగిపోయిన కార్పొరేటర్
పోలీసులకు లొంగిపోయిన కార్పొరేటర్
కరీంనగర్ ( వాయిస్ న్యూస్ ) జనవరి 24
భూకబ్జాలు బలవంతపు వసూళ్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 21వ డివిజన్ కార్పొరేటర్ జంగిల్ సాగర్ అనూహ్యంగా కరీంనగర్ పోలీసుల ఎదుట బుధవారం లొంగిపోయాడు. జంగిల్ సాగర్ ను పట్టుకునేందుకు గత మూడు రోజులుగా పోలీసులు గాలిస్తుండగా కరీంనగర్ రూరల్ ఏసిపి కార్యాలయంలో లొంగిపోవడం సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. సాగర్ పై పలు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అవ్వడంతో పాటు.. పలువురి పై దాడి చేయడం, ఆస్తులు ధ్వంసం చేయడం, భూకబ్జాలకు పాల్పడట్లు నేరా ఆరోణలున్నాయి. అయితే సాగర్ అనుచరులు ఇద్దరు నిన్న అరెస్ట్ అవడం.. సాగర్ పోలీసులకు లొంగిపోవడం ఇప్పుడు కరీంనగర్ లో హాట్ టాపిక్ గా మారింది.