ప్రజా సమస్యలపై పోరాటాలు ఉధృతం చేయాలి
ప్రజా సమస్యలపై పోరాటాలు ఉధృతం చేయాలి
-సిపిఎం నగర మహాసభల్లో జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి
కరీంనగర్ లో స్థానిక కోతి రాంపూర్ లోని ముకుంద లాల్ మిశ్రా భవన్ లో సిపిఎం కరీంనగర్ పట్టణ 9వ మహాసభలు ఘనంగా నిర్వహించారు.
నగర సీనియర్ నాయకులు పుల్లెల మల్లయ్య జెండా ఆవిష్కరణ చేశారు.
అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ నగరంలో ప్రజా సమస్యలపై సిపిఎం అనేక కార్యక్రమాలు నిర్వహించిందని అన్నారు.
గత మూడు సంవత్సర కాలంలో నగరంలోని రోడ్లు డ్రైనేజీ సౌకర్యాలు కల్పించాలని, డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలని, రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించి ప్రజలకు సౌకర్యం కల్పించాలని, నగరంలో వీధి కుక్కలు, కోతుల బెడద నుండి ప్రజలను రక్షించాలని అనేక పోరాటాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు.
అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని స్థానిక సమస్యలు పరిష్కరించాలని నిత్యం ప్రజా సమస్యలపై సిపిఎం రాజులేని పోరాటాలు నిర్వహిస్తుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్యం చేస్తూ ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని అన్నారు.
బిజెపి అధికారంలోకి వచ్చాక నిత్యవసర సరుకుల ధరలు రోజురోజుతున్నాయని అన్నిటిని జిఎస్టి లోకి తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ను ఎందుకు జీఎస్టీ పరిధిలోకి తీసుకురాలేదని ప్రశ్నించారు.
పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం మూలంగా రవాణారంగంపై భారం పడి అన్నిటి ధరలు పెరగడానికి పరోక్షంగా ఉపయోగపడుతుందని అన్నారు.
సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల ఉద్యమ కార్యక్రమాలను సమీక్షించుకొని భవిష్యత్తులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతర పోరాటం చేస్తామని అన్నారు.
నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ మహాసభల్లో పలు తీర్మానాలు చేశారు.
తీర్మానాలు
1) రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలి.
2) డంపింగ్ యార్డును నగరం నుండి దూర ప్రాంతాలకు తరలించాలి.
3) అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు పెన్షన్ ఇవ్వాలి
4) నగరంలో వీధి కుక్కలు కోతల బెడద నుండి ప్రజలను రక్షించాలి.
4) రోడ్లు డ్రైనేజీ సౌకర్యం కల్పించాలి
5)ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకొని ప్రభుత్వ భూమిని రక్షించాలి.
అని పలు తీర్మానాలు చేశారు.
ఈ మహాసభల్లో నగర కార్యదర్శి గుడికందుల సత్యం, కమిటీ సభ్యులు పున్నం రవి, పుల్లెల మల్లయ్య,జీ .తిరుపతి, గాజుల కనకరాజు, నాయకులు జగదీష్, నాంపల్లి, లింగారెడ్డి, వినయ్,అఖిల్, నరేష్ తదితరులు పాల్గొన్నారు