ప్రైవేట్ హాస్టల్ భవనం పై నుంచి పడిన విద్యార్థినీ…తలకు తీవ్ర గాయాలు…
ప్రైవేట్ హాస్టల్ భవనం పై నుంచి పడిన విద్యార్థినీ…
తలకు తీవ్ర గాయాలు…
హాస్పిటల్ కు తరలించిన స్థానికులు, పోలీసులు..
కరీంనగర్ , తిమ్మాపూర్ (వాయిస్ న్యూస్)
మే3
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలోనీ ఓ ప్రైవేటు హాస్టల్లో ఉంటున్న విద్యార్థినీ శివ ప్రియ స్థానిక ప్రైవేట్ ఫార్మసీ కళాశాలలో ఫామ్ డి చదువుతోంది.
శుక్రవారం ఉదయం భవనం పై నుంచి పడడం తో కాళ్ళు ,చేతులు విరిగి, తలకు తీవ్ర గాయాలు అయ్యాయని స్థానికులు తెలిపారు. పోలీసులు, స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే శివ ప్రియ భవనం పై నుంచి దూకిందా..?లేక ప్రమాదవశాత్తు కింద పడిందా..? అనే వివరాలు తెలియాల్సి ఉంది.ఈ విషయమై తమకు ఇంకా ఫిర్యాదు అందలేదని ఎస్ఐ చేరలు తెలిపారు.