రామగుండం కార్పొరేషన్ లో పెట్రోల్ దందా
రామగుండం కార్పొరేషన్ లో పెట్రోల్ దందా
వారానికి పోసింది 24 లీటర్లు…రికార్డ్ లో మాత్రం 30 లీటర్లు….
5 లక్షల రూపాయల అదనపు బిల్లు రికార్డ్
ఆందోళనకు దిగిన వాహనల డ్రైవర్లు.
ఓ అధికారి కీలక సూత్రదారి….
పెద్దపల్లి / గోదావరిఖని ( వాయిస్ న్యూస్ ) మే 22
-:రామగుండం కార్పొరేషన్ లో అవినీతి రాజ్యమేలుతుంది.తిరుగని వాహనాలకు కూడా పెట్రోలు,డిజిల్,వినియోగం చేసిన్నట్లు,రికార్డులు తయారు చేస్తు,లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారని,ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.కార్పొరేషన్ లో 50 ఆటోలు,20 ట్రాక్టర్లు,జెసిబిలు,కంపాక్టర్లు ఉన్నాయి.వీటి పేరుమీద నెలనెల లక్షలాది రూపాయలు నొక్కుతున్నారు.ఒకొక్క ఆటోకు నెలకు వంద లీటర్ల వరకు పెట్రోల్ అవసరం ఉంటుంది.కాని ఓ విభాగం లో పనిచేసే ఓ అధికారి లెక్కల్లో గోల్ మాల్ కు తెర లేపినాడు.వారానికి 30 లీటర్ల పెట్రోల్ పోయవలసి ఉండగా, 24 లీటర్లు మాత్రమే పోసి 30 లీటర్లు పోసిన్నట్లు రికార్డు వ్రాసి,అదనంగా అయిదు లక్షల రూపాయలు బిల్లులు రికార్డ్ వ్రాసిన్నట్లు సమాచారం.నడవని వాహనాలకు కూడ డీజిల్ పోసిన్నట్లు రికార్డు నమోదు చేశాడు.ఖాజీపల్లిలో ఓ బంక్ లో వాహనాలకు పెట్రోల్, డీజిల్ పోయిస్తున్నారు.అంతే కాకుండా కొంతమంది కార్పోరేటర్ల వాహనాలకు డీజిల్ పోస్తున్నట్లు దీని పై మిగితా కార్పోరేటర్లు సదరు అధికారితో వాగ్వివాదం కు దిగిన్నట్లు తెలిసింది.ఏదిమైన రామగుండం లో అవినీతికి తావులేకుండా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ పరిపాలన కొనసాగిస్తుండగా కొంతమంది ఇలాంటి అవినీతి అధికారులతో చెడ్డ పేరు వస్తుంది.కార్పొరేషన్ లో జరుగుతున్న అవినీతికి కళ్లెం వేయాలని రామగుండం ప్రజలు కోరుతున్నారు.