ఆర్ ఎఫ్ సి ఎల్ భూ కబ్జా
ఆర్ ఎఫ్ సి ఎల్ భూ కబ్జా
పెద్దపల్లి రామగుండం వాయిస్ న్యూస్ జనవరి 14
రామగుండం ఎరువుల కర్మాగారం స్థలాలపై భూకబ్జాదారుల కన్నుపడింది. ఈ మేరకు పెద్దపెల్లి జిల్లా గోదావరిఖని శాంతి నగర్ లో ఉన్న ఆర్ ఎఫ్ సి ఎల్ కు చెందిన భూమి కబ్జాకు గురైంది. కబ్జాదారులు ఎవరికి అనుమానం రాకుండా అర్ధరాత్రి వేళల్లో నిర్మాణాలు చేస్తున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటన స్థలానికి వెళ్లిన ఆర్ ఎఫ్ సి ఎల్ సెక్యూరిటీ సిబ్బంది భారీ గెట్లతో నిర్మించిన ప్రహరీగోడ ను కూల్చి వేశారు. ఎరువుల కర్మాగారం స్థలాలను భూకబ్జాదారులు యదేచ్చగా కబ్జాలు చేస్తున్నారని స్థానికులు తెలిపారు. ఎన్ని స్థలాలు కబ్జాలకు గురవుతున్నా అధికారులు పటించుకోడంలేదని కబ్జాదారులతో అధికారులు కుమ్మక్కై ఉండవచ్చని అధికారుల కనుసైగల్లోనే ఇలాంటి జరుగుతున్నాయి ఏమో అని స్థానికుల గుసగుసలు వినపడుతున్నాయి.