December 23, 2024

karinmangar voice

telugu news

సిరిసిల్ల పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ బంద్.

Spread the love

సిరిసిల్ల పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ బంద్.

15వ తేదీ నుండి బంద్

దేశవ్యాప్త సంక్షోభమే కారణం.

వీధినపడనున్న కార్మిక కుటుంబాలు.

ప్రభుత్వ ఆర్డర్లపై కొరవడిన స్పష్టత.

రాజన్న సిరిసిల్ల ( వాయిస్ న్యూస్ ) జనవరి 16

సిరిసిల్ల పాలిస్టర్ వస్త్ర పరిశ్రమను జనవరి15 నుండి నిరవధకంగా పరిశ్రమ బంద్ పాటిస్తున్నారు.

దేశవ్యాప్తంగా వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభంతో పాటు కొత్త ఆర్డర్లు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పడం లేదని పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ యజమానులు తెలిపారు.

ఇప్పటికే లక్షలాది మీటర్ల వస్త్రం గోడౌన్ లలో పేరుకు పోయిందని, కొత్తగా నూలు దారాన్ని కొని వస్రోత్పత్తిని కొనసాగించే పరిస్థితిలో పాలిస్టర్ యజమానులు లేరని వారు వెల్లడించారు.

గతంలో ఉత్పత్తి చేసిన వస్త్రం తాలూకు బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం వద్ద నుండి రాకపోవడంతో కొత్త పెట్టుబడులు పెట్టలేకపోతున్నామని యజమానులు ఆవేదన చెందుతున్నారు.

వీధిన పడనున్న నేత కార్మికులు.

సిరిసిల్ల పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ బంధు నిర్ణయంతో వేలాదిమంది పవర్లూమ్, నేత కార్మికులు ఉపాధి లేక రోడ్డున పడనున్నారు.

ఇప్పటికే బతకమ్మ చీరల ఆర్డర్ ముగిసినప్పటి నుండి సిరిసిల్లలో పవర్లూమ్ పరిశ్రమ మందకోడిగా కొనసాగుతోంది.

పరిశ్రమలో చేతినిండా పని లేక కార్మికులు చాలినంత ఉపాధిని పొందలేకపోతున్నారు.
ఈ నేపథ్యంలో వస్త్ర పరిశ్రమలో సంక్షోభం పేరుతో పాలిస్టర్ యజమానులు తీసుకున్న నిర్ణయం పరిశ్రమపై ఆధారపడి బతుకుతున్న పవర్లూమ్ కార్మికుల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేయనుంది.

రోజువారి వేతనాలతో పనిచేసే నేత కార్మికులు పరిశ్రమ బంద్ అయితే ఉపాధి లేక వీధిన పడనున్నారు.

ప్రభుత్వ ఆర్డర్లపై కొరవడిన స్పష్టత.

రాష్ట్ర ప్రభుత్వం నుండి సిరిసిల్ల పవరలూమ్ పరిశ్రమకు అందించే ఆర్డర్లు యధావిధిగా కొనసాగుతాయని అధికారులు ప్రకటించినప్పటికీ ఆర్డర్ల విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది.

ప్రభుత్వం నుంచి తమకు ఏ ఆర్డర్లు అందలేదని పరిశ్రమల యజమానులు అంటున్నారు.

మరోవైపు కేవలం 600 లోపు మర మగ్గాలు నడిచే టెక్స్టైల్ పార్కుకు, 25 వేలకు పైగా మరమగ్గాలు నడిచే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు సమానంగా ఆర్డర్లు ఇస్తామని అధికారులు చెప్పడం పట్ల కూడా సిరిసిల్ల పట్టణ పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ యజమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం నుంచి రావలసిన బకాయిలు రాకుంటే పరిశ్రమలు నడపలేమని యజమానులు స్పష్టం చేస్తున్నారు.

పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ బందు చేస్తే వెయిల కుటుంబాలు, కార్మికులు రోడ్డున పడే పరిస్తితి ఉందని పవర్లూమ్ యజమానులు పాలిస్టర్ బట్టకు మార్కెట్లో గిట్టుబాటు ధర లేదని బందు పెట్టడం సరికాదని యజమానులు జౌలి శాఖ అధికారులను ప్రభుత్వంతో మాట్లాడి సమస్య పరిష్కరించేలా మాట్లాడుకోవాలని పరిస్త్రమ పై ఆధారపడి ఎన్నో కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నారని మళ్లీ సిరిసిల్ల ఉరిసిల్లగా మారే అవకాశం ఉందని కార్మికులు ఆవేదన చెందుతున్నారు . తక్షణమే ప్రభుత్వం కల్పించుకొని పవర్ లూమ్ లు యధావిధిగా నడిచేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

30 సంవత్సరాల నుంచి పవర్ లూమ్స్ నడుపుతున్నామని ఎన్నడూ లేని విధంగా ఈనెల 15 నుండి నిరవధికంగా యజమానులు బందు పెట్టడం సరికాదని పాలిస్టర్ వస్త్ర పరిశ్రమపై వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నారని, కార్మికులు జీవనోపాధి కోల్పోయే అవకాశం ఉందని కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందని యజమానులు ప్రభుత్వంతో మాట్లాడి సమస్య పరిష్కరించేలా చూసుకొని సాంచాలు నడిచేల చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు.

పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ యజమానుల మెరుపు సమ్మె పై మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

వస్త్ర పరిశ్రమ సంక్షోభంపై కేటీఆర్ ట్వీట్.

వస్త్ర పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టొద్దు.

గత ప్రభుత్వ విధానాలు కొనసాగిస్తూనే కాంగ్రెస్ ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలి.

పదేళ్లలో వస్త్ర పరిశ్రమ ఎంతో అభివృద్ధి చెందింది.

Copyright © All rights reserved by KARIMNAGAR VOICE NEWS | Newsphere by AF themes.