వీధి కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాలి
వీధి కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాలి
మణుగూరు తహశీల్దార్ వి. రాఘవ రెడ్డి కి వినతి పత్రం అందజేసిన సామాజిక సేవకులు కర్నె బాబురావు
భద్రాద్రి కొత్తగూడెం (వాయిస్ న్యూస్)
నవంబర్ 9
మణుగూరులో గ్రామ సింహాల గుంపులు ప్రజల్ని హడలేత్తిస్తున్నాయని వీధి కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాలని కోరుతూ
శనివారం నాడు మణుగూరు తహశీల్దార్ వి. రాఘవరెడ్డి గారికి వినతి పత్రం అందజేసినట్లు సామాజిక సేవకులు కర్నె బాబురావు విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలం సమితి సింగారం పంచాయతీ పరిధిలోని సీతానగరంలో గత రెండు రోజుల క్రితం వీధి కుక్క ఒక చిన్నారి తో పాటు నలుగురు పెద్దలను కూడా తీవ్రంగా గాయపరిచిందని. మండలంలో వీధి కుక్కల వల్ల ఏదో ఒకచోట ఏదో ఒక సంఘటన చోటు చేసుకుంటోందన్నారు. దీంతోపాటు రాత్రి వేళల్లో కుక్కల అరుపులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. గురువారం నాడు సింగరేణి కార్మికుడ్ని కూడా తీవ్రంగా గాయపరిచాయన్నారు. సింగరేణి కార్మికులు నైట్ షిఫ్ట్ డ్యూటీ కి వెళ్లాలన్నా సెకండ్ షిఫ్ట్ డ్యూటీ ముగించుకుని తిరిగి ఇంటికి రావాలన్నా భయపడుతున్నారని.మున్సిపాలిటీ పరిధిలోను మరియు గ్రామపంచాయతీల పరిధిలో కుక్కలను నియంత్రణకు తగు చర్యలు తీసుకోవాలని మనవి చేస్తున్నానన్నారు. అదేవిధంగా ప్రభుత్వ వైద్యశాలలో యాంటీ రాబిస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంచే విధంగా తగు చర్యలు చేపట్టాల్సిందిగా వి. రాఘవ రెడ్డి ని విజ్ఞప్తి చేసినట్లు ఆయన తెలిపారు. వీరితోపాటు మణుగూరు మున్సిపల్ కమిషనర్ కి కూడా వినతిపత్రం అందజేయనున్నట్లు కర్నే బాబురావు తెలిపారు.