ఉర్సే ఖాద్రీ.. ఉర్స్ శాసహబ్ ఖిబ్లా అలైహిరహ్మాను విజయవంతం చేయండి
ఉర్సే ఖాద్రీ.. ఉర్స్ శాసహబ్ ఖిబ్లా అలైహిరహ్మాను విజయవంతం చేయండి
కరీంనగర్, డిసెంబర్ 17:-
కరీంనగర్ నగరంలోని షా సాహబ్ మొహల్లాలో బుధవారం నుండి శుక్రవారం వరకు జరిగే ఉర్సే ఖాద్రి, ఉర్స్ షా సాహబ్ అలైహిరహ్మా ఆధ్యాత్మిక సదస్సులను విజయవంతం చేయాలని సయ్యద్ షా హాశిరోద్దీన్ ఖాద్రీ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో భాగంగా ఉర్స్ హజ్రత్ మీరా సయ్యద్ షా తాజ్ ఉద్దీన్ ఖాద్రీ అల్ జిలానీ అలైహిర్రహ్మ, ఉర్స్ హజ్రత్ మీరా సయ్యద్ షా అబ్దుల్లా క్వాద్రీ అల్ జిలానీ అలైహిర్రహ్మ, ఉర్స్ హజ్రత్ మీరా సయ్యద్ షా ఖాజా మొహియుద్దీన్ క్వాద్రీ అల్ జిలానీ అలైహిర్రహ్మ, ఉర్స్ హజ్రత్ మీరా సయ్యద్ షా గౌస్ మొహియుద్దీన్ క్వాద్రీ అల్ జిలానీ అలైహిర్రహ్మా ఉర్స్ ఉత్సవాలు 18డిసెంబర్ బుధవారం, 19డిసెంబర్ గురువారం, 20డిసెంబర్ శుక్రవారం వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. నేడు 18వ తేదీ బుధవారం ఇషా నమాజు అనంతరం జామా మసీద్ ప్రాంగణంలో ఫజర్ గుసుల్ షరీఫ్ మజార్ పాక్, నాత్ షరీఫ్, మనఖబత్ కార్యక్రమం, ఖాన్ఖా షా సాహబ్, దర్గా సయ్యద్ అలీ షా సాహబ్ వద్ద జరుగుతుందన్నారు.
19డిసెంబర్ గురువారం ఇషా నమాజు అనంతరం జామా మస్జిద్ లో జల్సా ఫైజానే గౌసే అజం రజియల్లాహు అన్హు ఆధ్యాత్మిక సదస్సు జరుగుతుందన్నారు. జల్సా అనంతరం లంగర్ పెద్దఎత్తున అన్నదాన కార్యక్రమం ఉంటుందన్నారు. 20తేదీన శుక్రవారం అసర్ తర్వాత జామా మసీదు వద్ద సందల్ షరీఫ్ దర్గా సయ్యద్ అలీ షా సాహెబ్ (షా సాహెబ్ వీధి సమీపంలోని ఖాన్ఖా షా సాహబ్ వద్ద మగ్రిబ్ ఫాతేహా అనంతరం ఫాతేహా లంగర్ అన్నదానంతో పాటు మహిఫిల్ సమా కార్యక్రమం అల్హాజ్ సయ్యద్ షా ఖాజా మొహియుద్దీన్ క్వాద్రీ అల్ జిలానీ సాహబ్ (కమల్ పాషా) అధ్యక్షతన జరుగుతుందన్నారు.
ఖలీఫా హుజూర్ షంషుల్ మశాయిఖ్, సహజాదా గరీబ్ నవాజ్ హజ్రత్ అల్లమా సయ్యద్ హమ్మద్ ఉల్ హసన్ చిష్టి క్వాద్రీ సాహబ్ (అజ్మీర్ షరీఫ్) పర్యవేక్షణలో, హజ్రత్ అల్లామా మౌలానా ముఫ్తీ మొహమ్మద్
షాయన్ రజా క్వాద్రీ ఖిబ్లా బయాన్ ప్రసంగం ఉటుందన్నారు. పెద్ద ఎత్తున సున్నీ ముస్లిం సమాజం హాజరై ఈ ఆధ్యాత్మిక సదస్సులను, కార్యక్రమాలను విజయవంతం చేయాలని సయ్యద్ షా హాశిరోద్దీన్ ఖాద్రీ కోరారు.